ETV Bharat / lifestyle

సినిమాల్లో నటించేందుకు నేను రెడీ: మానస వారణాసి - వీఎల్​సీసీ మిస్​ ఇండియా వరల్డ్ వార్తలు

ఫ్యాషన్ రంగంలో రాణించాలి. బ్యూటీ షోలలో తళుక్కున మెరవాలి..నేటితరం అమ్మాయిలు ఎందరో ఇలా కలలు కంటుంటారు. అయితే ఆ కలలను సాకారం చేసుకుని... తెలంగాణ నుంచి మొట్టమొదటి మిస్ ఇండియా వరల్డ్ కిరిటాన్ని దక్కించుకుంది మన హైదరాబాద్ అమ్మాయి మానస వారణాసి. చదువుతోపాటు... భరతనాట్యం, సంగీతం వంటి కళల్లోనూ ప్రావీణ్యం సాధించిన మాసన... వీఎల్​సీసీ మిస్ ఇండియా వరల్డ్ 2021గా నిలిచింది. మంచి అవకాశాలు వస్తే సినిమాల్లోనూ నటించేందుకు సిద్ధమే అంటున్న మాసన వారణాసితో ఈటీవీ భారత్ ముఖాముఖి..

vlcc miss india world 2020 winner manasa varanasi interview
తల్లిదండ్రులు వద్దని వారించినా ఒప్పించాను: మానస వారణాసి
author img

By

Published : Feb 18, 2021, 7:42 PM IST

తల్లిదండ్రులు వద్దని వారించినా ఒప్పించాను: మానస వారణాసి

ప్ర. తెలంగాణ నుంచి మొట్టమొదటి మిస్ ఇండియా వరల్డ్​గా ఎంపిక అవ్వటం ఎలా ఉంది?

జ. తెలంగాణ నుంచి భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం నుంచి ఈ కిరీటాన్ని దక్కించుకోవటం గర్వంగా ఉంది. ఇది ఒక గౌరవంగా భావిస్తున్నాను.

ప్ర. కుటుంబంలో ఎవరూ ఫ్యాషన్ రంగంలో లేరు. మరి మీకు ఆ రంగంవైపు వెళ్లాలని ఎలా అనిపించింది? కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది?

జ. ప్రారంభంలో కుటుంబాన్ని ఒప్పించడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. మాది మధ్యతరగతి, చాలా సాధారణ కుటుంబం. అందరూ చదువులపైనే ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. కాబట్టి ఫ్యాషన్ రంగంలోకి వచ్చేందుకు ఒప్పించటం కాస్త ఇబ్బంది అయ్యింది. కానీ కొత్త విషయాలను తెలుసుకోవటానికి, ఛాలెంజ్​లను స్వీకరించటానికి నేను ఎంతగానో ఇష్టపడతాను. ఒకరోజు కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి నా ఇష్టాన్ని వివరించి ఒప్పించాను. ఇప్పుడు వాళ్లంతా నా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు.

ప్ర. మిస్ ఇండియా చరిత్రలోనే తొలిసారి వర్చువల్ ప్రెజెంట్​ని నిర్వహించారు. ఇందుకోసం మీరు ఎలా సన్నద్ధమయ్యారు.?

జ. నిజంగా గతంలో ఎప్పుడూ ఇలాంటిది జరగలేదు. మొదటిసారి వర్చువల్​గా పోటీలను నిర్వహించారు. ఇది కాస్త ఇబ్బంది కలిగించింది. అన్ని సార్లు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండాలి. ఒక్కోసారి నెట్​వర్క్ సమస్యలు వస్తాయి. మొదట్లో అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము. కానీ వాటి నుంచి చాలా నేర్చుకున్నాము. మా కుటుంబ సభ్యులు కూడా బాగా సహకరించారు. ఇంటినుంచి పాల్గొనటంవల్ల నాకు వారి పూర్తి మద్దతు లభించింది.

ప్ర. భరతనాట్యం వంటి కళలు కూడా నేర్చుకున్నారు. కళల వైపు మిమ్మల్ని ఎవరు నడిపారు?

జ. చిన్నప్పుడు మా అమ్మ నన్ను కళలవైపు నడిపించారు. నాకు ఐదేళ్లు ఉన్నప్పుడే స్నేహితులు నేర్చుకుంటున్నారని... మా అమ్మ కూడా నన్ను సంగీతం, భరతనాట్యం నేర్చుకునేందుకు పంపారు. రెండేళ్లు సంగీతం, ఎనిమిదేళ్లపాటు నాట్యం నేర్చుకున్నాను. మా అమ్మ చేసిన ఆ పని నాకు ఎంతగానో ఉపయోపడుతోంది. నేను నేర్చుకున్నవి నా వ్యక్తిత్వ నిర్మాణంలో ఉపయోగపడ్డాయని అనుకుంటున్నాను.

ప్ర. బ్యూటీ ప్రెజెంట్స్​లో రాణించాలంటే ముందుగా మీకు కొంత ఫ్యాషన్​పై అవగాహన ఉండాల్సి ఉంది. మీకు సంబంధించి ఫ్యాషన్​కి నిర్వచనం ఏమిటి? ఎలాంటి రంగులను ఎక్కువగా ఇష్టపడతారు?

జ. మిస్ ఇండియా పోటీలకు వెళ్లాలనుకున్నప్పటి నుంచి నేను ఫ్యాషన్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను ఎప్పుడు మా అమ్మ ఏది కొంటే అవే వేసుకునే దాన్ని. కానీ ఇటీవలి కాలంలో నేను ఏం వేసుకుంటున్నాననే దానిపై ఎక్కువగా దృష్టిపెడుతున్నాను. కొత్త కొత్త ఫ్యాషన్లను ప్రయత్నిస్తున్నాను. మీరు ఏం వేసుకుంటారో అదే మీ పర్సనాలిటీగా కనిపిస్తుంది. కొత్త కొత్త రంగులు, కాంబినేషన్లు అలవాటు చేసుకున్నాను. సోషల్ మీడియా ద్వారా మరిన్ని ఫ్యాషన్లు తెలుసుకుంటున్నాను.

ప్ర. మిస్ ఇండియాగా నిలిచేందుకు ఎందరో పోటీ పడుతుంటారు. అందులో మీరు మొదటి స్థానంలో నిలిచేందుకు మీలోని ఏదో ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఉండి ఉంటుంది. అది ఏమిటి అనుకుంటున్నారు. మిస్ ఇండియా పోటీల్లో మీకు వచ్చిన ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇచ్చారు.?

జ. నా మనసు, ఆలోచన, శరీరంపై నాకు అవగాహన ఉంది. వాటి మధ్య ఎప్పుడూ సమతుల్యం ఉండేలా చూసుకోవటం నా ప్రత్యేకత అనుకుంటా. పోటీల్లో కూడా ఇదే చెప్పాను. మన ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు వస్తాయి. కానీ వాటిని మనం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది.

ప్ర. గతంలో మిస్ ఇండియాగా గెలిచిన అనేక మంది సినిమా రంగంలో స్థిరపడ్డారు. మరి మీకు ఆ దిశగా వెళ్లే ఆలోచన ఉందా?

జ. ప్రస్తుతానికి నా ఆలోచన మొత్తం మిస్ వరల్డ్ పోటీలపైనే ఉంది. అయితే సినిమాల్లో మంచి అవకాశాలు వస్తే నటిస్తానేమో.

ప్ర. బ్యూటీ ప్రెజంట్స్ అంటే చాలా మంది శారీరక అందం గురించే అనుకుంటారు. దీనిపై మీరేమంటారు?

జ. బ్యూటీ ప్రెజంట్స్ ఒకప్పటిలా ఇప్పుడు లేవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో శారీరక, మానసిక అందం రెండింటికీ ప్రాముఖ్యత ఉంటుంది. కేవలం శారీరక అందంపైనే ఈ పోటీలు ఆధారపడి ఉండవు. ఏదైనా అంశంపై మన గళం వినిపించేందుకు ఇలాంటి పోటీలు చక్కని వేదికలుగా నిలుస్తున్నాయి.

ఇదీ చూడండి: చిన్నప్పుడు పాచిపనులు కూడా చేశా.. అందాల రాణి కన్నీటి గాథ.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.