ETV Bharat / lifestyle

ఓ తల్లి ప్రేమ బ్రాండ్‌గా మారింది!

ప్రతి తల్లీ తన బిడ్డకు అమితమైన ప్రేమ, సంరక్షణ అందించాలని కోరుకుంటుంది.. పాపాయి కోసం ఏం వాడాలన్నా... అది సురక్షితమా కాదా అని ఒకటికి పదిసార్లు నిర్ధారించుకుంటుంది. అలానే ఆలోచించిన గజల్‌ అలగ్‌ చిన్నారులకి వాడే ఉత్పత్తుల్లో హానికారక రసాయనాలున్నాయని గమనించింది. అందుకు ప్రత్యామ్నాయాల్ని వెతికింది. అలా ‘మామా ఎర్త్‌’ ప్రాణం పోసుకుంది. ఆ ఉత్పత్తులు నచ్చి నటి శిల్పాశెట్టి సైతం అందులో పెట్టుబడి పెట్టింది. ఆ వివరాలు తెలుసుకుందామా!

special story on Mumma Earth product
ఓ తల్లి ప్రేమ బ్రాండ్‌గా మారింది!
author img

By

Published : Aug 11, 2020, 10:27 AM IST

జల్‌ అలగ్‌ది హరియాణాలోని గురుగ్రామ్‌. భర్త వరుణ్‌. తమ జీవితంలోకి పండంటి బిడ్డని ఆహ్వానించాలని నిర్ణయించుకున్న ఈ జంట....పుట్టబోయే చిన్నారికోసం అవసరమైన వస్తువుల శోధన ముందే మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే బుజ్జాయిలకి వాడే చాలా ఉత్పత్తులు హానికారక రసాయనాల సమ్మేళనం అని గుర్తించింది. భర్తతో కలిసి రసాయనాలు కలపని వాటికోసం ఇంటర్నెట్‌లో శోధించింది గజల్‌. మార్కెట్‌లు తిరిగింది. కానీ వారికి నిరాశే ఎదురైంది. ఈలోగా నెలలు నిండి ప్రసవమయ్యింది. ఇక తప్పక అమెరికా నుంచి వాటిని తెప్పించుకోవడం మొదలుపెట్టారు. ఇవి ఖరీదుతో కూడుకున్నవి... తెప్పించుకోవడమూ కాస్త కష్టమైన విషయంగా అనిపించింది. ఎలాగైనా దానికి పరిష్కారం వెతకాలనుకుంది. భర్త తన ఆలోచనని సమర్థించాడు. దాంతో వారి బిడ్డకే కాదు... తల్లీపిల్లలందరికీ ఉపయోగపడేలా అలాంటి ఉత్పత్తులు తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చారు ఇద్దరూ. అలా 2016లో ‘మామా ఎర్‌’్త సంస్థను ప్రారంభించారు. దీనిద్వారా తల్లీబిడ్డల సంరక్షణ కోసం స్వచ్ఛమైన చర్మ, కేశ ఉత్పత్తుల తయారీ ప్రారంభించారు.

సవాళ్లెన్నో... ఆలోచన వచ్చింది...దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నంలో వీరికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఆరునెలలపాటు వీరు నిద్రలేని రాత్రుళ్లు గడిపారు. డాక్టర్లు, ఆయుర్వేద నిపుణుల సాయంతో వివిధ పద్ధతుల్లో ఉత్పత్తుల తయారీ మొదలుపెట్టారు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అవి తుదిరూపు దిద్దుకున్నాయి. ఆపై అన్ని అనుమతులూ తీసుకుని సంస్థ ప్రారంభించారు. ఈ నిర్ణయానికి ముందు ‘ఈ పని చేయాలా వద్దా’ అని చాలా ఆలోచించారు. వీళ్లని ఎక్కువగా ప్రభావితం చేసిన చిత్రం ‘త్రీ ఇడియట్స్‌’. అందులోని హీరోలా మనసుకు నచ్చిన పని మాత్రమే చేయాలనుకున్నారు. అందుకే కోకాకోలా సంస్థలో సీనియర్‌ మేనేజర్‌గా పనిచేసిన వరుణ్‌ దీని కోసం ఆ ఉద్యోగాన్నీ తేలిగ్గా వదిలేశాడు. గజల్‌ గతంలో పెయింటింగ్‌ స్టూడియోను నడిపేది. ఆమె దాన్ని వదులుకుంది. మొదట్లో వీరి ఆలోచన చూసి చాలామంది ‘హాయిగా ఉద్యోగం చేసుకోక ఎందుకీ కష్టం’ అంటూ నిరుత్సాహపరిచేవారు. అయినా వెనకడుగు వేయలేదు.

ఓ తల్లి ప్రేమ బ్రాండ్‌గా మారింది!
శిల్పాశెట్టి మెచ్చింది

అందరికీ అందుబాటులో...

సాధారణంగా సహజ ఉత్పత్తులు అనగానే ఖరీదు ఎక్కువ అని భయపడుతుంటారు చాలామంది. వారందరికీ అందుబాటు ధరల్లో, 100శాతం సహజ ఉత్పత్తులను అందివ్వాలనుకోవడం పెద్ద సాహసమే. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత నాణ్యమైన ముడిసరకుని అందించే సంస్థలను వెతికి సంప్రదించారు. ప్రళాళికబద్ధంగా నడుస్తూ నాలుగేళ్లలోనే ‘మేడ్‌సేఫ’్‌ సరిఫ్టికేషన్‌ పొందారు. ఆసియాలోనే ఆ ఘనత సాధించిన ఫస్ట్‌బ్రాండ్‌గా నిలిచింది ‘మామా ఎర్త్‌’. ఆరు రకాల పిల్లల ఉత్పత్తులతో ప్రారంభమయ్యాయి ఈ సంస్థ కార్యకలాపాలు. తరువాత కాలంలో చిన్నపిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు, ముఖ్యంగా గర్భం దాల్చిన మహిళలకు సుమారు ఎనభై రకాల ఉత్పత్తుల్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పదిహేను లక్షలమంది వినియోగదారులు ఉన్నారీ సంస్థకు. టర్నోవర్‌ రూ.100 కోట్లకు చేరుకుంది. అమెజాన్‌, ఫస్ట్‌క్రై, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎమ్‌ మాల్‌ వంటి ఈ-కామర్స్‌ పోర్టళ్లలోనూ ఈ ఉత్పత్తులు లభిస్తున్నాయి.

శిల్పాశెట్టి మెచ్చింది...

ఈ ఉత్పత్తులను ప్రశంసించడమే కాదు... వీటికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది నటి శిల్పాశెట్టి. అంతకాదు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికీ శిల్ప ముందుకొచ్చారు. ‘తల్లిగా వీటిని ఉపయోగించినప్పుడు నాకు నమ్మకం కలిగింది. అందుకే పెట్టుబడి పెట్టా’ అంటుంది శిల్ఫ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.