ETV Bharat / lifestyle

పేద మహిళల ఆర్థికసాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న రాజకుమారి - duiya kumari latest news

నిజమైన రాచరికం అంటే కోటలో ఉండటం కాదు ప్రజల గుండెల్లో ఉండటమే అని నమ్మారు దియాకుమారి... అందుకే రాజభవనాల ద్వారాలను తెరిచి అక్కడ మహిళలకు కావాల్సిన నైపుణ్యాలను అందిస్తూ వారి ఆర్థికస్వేచ్ఛకు పెద్దపీట వేస్తున్నారు రాకుమారి...

princess working towards the economic empowerment of poor women in rajastham
పేద మహిళల ఆర్థికసాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న రాజకుమారి
author img

By

Published : Oct 27, 2020, 4:34 PM IST

ఫ్యాషన్‌ రాజధాని ప్యారిస్‌కేకాదు... లండన్‌, ఆస్ట్రేలియాలకు సైతం పీడీకేఎఫ్‌ తమ ఫ్యాషన్‌ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. పీడీకేఎఫ్‌ అంటే 'ప్రిన్స్‌ దియాకుమారి ఫౌండేషన్‌' అని అర్థం. పేద మహిళల ఆర్థికసాధికారతే లక్ష్యంగా సాగుతున్న ఈ సంస్థ జైపుర్‌లోని సిటీప్యాలెస్‌లో ఉన్న బాదల్‌మహల్‌లో నడుస్తోంది. దీన్ని ప్రారంభించిన దియాకుమారి మరెవరోకాదు... జైపుర్‌ రాజమాత గాయత్రీదేవి మనవరాలే. ప్రస్తుతం.. రాజ్‌సమంద్‌ నియోజకవర్గానికి ఎంపీగా సేవలందిస్తున్న దియా... మహారాజ్‌ సవాయి భవానీసింగ్‌ ఒక్కగానొక్క కూతురు. వారసత్వంగా కీలక బాధ్యతలనే ఆమె భుజానికెత్తుకున్నారు. అలనాటి రాజభవనాల నిర్వహణతోపాటూ ట్రస్టులూ స్కూళ్లనీ ఆమే పర్యవేక్షిస్తున్నారు. అందరూ ‘రాజకుమారి’ అని ఆప్యాయంగా పిలుచుకునే దియాకు ఖరీదైన చీరలకన్నా రాజస్థానీ సంప్రదాయాన్ని ప్రతిబింబించే లెహేరియా చీరలు ధరించడం అంటేనే ఇష్టం. అది కూడా పేదమహిళలకు అండగా ఉండే సంస్థల నుంచే వాటిని కొనుగోలు చేస్తుంటారామె.

అంతర్జాతీయ సంస్థలకు ఉత్పత్తులు...
princess working towards the economic empowerment of poor women in rajastham
రాజస్థాని మహిళలతో దియాకుమారి

పేదరికంలో మగ్గుతున్న రాజస్థాన్‌ మహిళలను ఆర్థికంగా ముందుకు నడిపించాలన్న లక్ష్యంతో ఎనిమిదేళ్ల క్రితం పీడీకేఎఫ్‌ని ప్రారంభించారు దియా. పర్యాటకులు జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే బాదల్‌మహల్‌నీ, తన నివాసాన్నే ఇందుకు వేదికగా చేసుకున్నారు. మహిళలకు కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీలలో శిక్షణ ఇచ్చి వాళ్లచేత రాజస్థానీ సంస్కృతి ప్రతిబింబించే కీచెయిన్లు, కోస్టర్లు, ఫ్యాబ్రిక్‌ నెక్లెస్‌లు, జర్దోసీ, గోటాపట్టీ పనితనంతో చేసిన చీరలు, లెహేరియా చీరలను ఇక్కడ తయారుచేయిస్తుంటారు. వీటిని అమ్మడానికి బాదల్‌మహల్‌లో దుకాణాన్నీ ఏర్పాటు చేశారు. దియాకుమారి చొరవతో ఈ ఉత్పత్తులకు ప్రపంచస్థాయి మార్కెట్‌ ఏర్పడింది. వీరి పనితనాన్ని మెచ్చి ప్యారిస్‌లోని చాటెల్లేస్‌ లగ్జరీ షూ బ్రాండ్‌, వియాన్నాకు చెందిన అంతర్జాతీయ ట్రావెల్‌ బ్యాగ్స్‌ తయారీ సంస్థ... వినియోగదారులుగా మారిపోయాయి. గతేడాది... మిస్‌ ఇండియా సుమన్‌రావు కూడా ఈ సంస్థ డిజైన్‌ చేసిన దుస్తుల్నే ప్రపంచ సుందరి పోటీల్లో ధరించడం విశేషం. కళలమీద ఇష్టంతో లండన్‌లో డెకరేటివ్‌ఆర్ట్స్‌లో డిగ్రీ చేసిన దియాకి ఇద్దరబ్బాయిలు, ఒకమ్మాయి. అమ్మాయి గౌరవి... న్యూయార్క్‌లో ఫ్యాషన్‌డిజైనింగ్‌ చదివి ప్రస్తుతం పీడీకేఎఫ్‌తోనే కలసిపనిచేస్తుంది.

పర్యటకులకు ఆతిథ్యం...

జైపుర్‌ అంటే కేవలం కోటలూ, భవనాలేనా? ఇక్కడ తినే ఆహారం, ప్రజల ఇళ్లు కూడా ప్రత్యేకంగా ఉంటాయనే దియా... మహిళలకు పర్యాటకం ద్వారా మరింత ఆదాయం వచ్చేలా చేశారు. ఎయిర్‌బీఎన్‌బీ అనే అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దీని సాయంతో... పీడీకేఎఫ్‌లోని సభ్యులు తమ ఇంటికి పర్యాటకులను ఆహ్వానించవచ్చు. తమకొచ్చిన వంటకాలు, కళలని పరిచయం చేసి ఆదాయం పొందవచ్చు. వీటితోపాటు, బాలికలకు ఉపయోగపడేలా ‘శిక్షా దియా’ అనే ప్రాజెక్టునీ ప్రారంభించారు దియా. ఈ ప్రాజెక్టు కింద ఆడపిల్లలకు ఉపకార వేతనాలు అందిస్తున్నారు. ఈ సేవలకుగాను రాజస్థాన్‌ రాష్ట్రానికి 'సేవ్‌గర్ల్‌చైల్డ్‌' కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యారామె. ‘సామాన్యులకంటే నువ్వేమీ ఎక్కువ కాదు... అని నాన్న చెప్పిన మాటలు నాకు పదేపదే గుర్తొస్తాయి. అందువల్లే పేదప్రజల ఇళ్లలోకి వెళ్లడానికి, వాళ్లింట్లో తినడానికి నాకేమాత్రం చిన్నతనంగా ఉండదు’ అంటారామె.

వర్చువల్‌ మ్యూజియం...

అణువణువూ రాజసం ఉట్టిపడే రాజభవనాలని ఒక్కసారైనా చూడాలని ఎవరికి ఉండదు? అందుకే దియాకూడా అలనాటి చారిత్రక వైభవాన్ని ప్రజలకు చేరువ చేయాలనుకున్నారు. ఇందుకోసం రాజ కుటుంబాలు ఉపయోగించిన వస్తువుల్నీ ప్రజలు చూడ్డానికి వీలుగా రాజభవనాలనే మ్యూజియాలుగా తీర్చిదిద్దారు. అలనాటి రాణులు ఉపయోగించిన వస్తువులూ, ఆభరణాలూ పల్లకీలను ఇక్కడ చూడొచ్చు. జైపుర్‌కి వచ్చినవాళ్లు మాత్రమే కాకుండా అందరికీ భారతీయ సంస్కృతి గొప్పదనం తెలిసేలా వర్చువల్‌ గ్యాలరీలను ఏర్పాటుచేశారు. సిటీ ప్యాలెస్‌, జైఘర్‌ఫోర్ట్‌, మహారాజా సవాయిమాన్‌సింగ్‌-2 మ్యూజియం ట్రస్ట్‌, జైఘర్‌ పబ్లిక్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌లతోపాటూ మరోమూడు ప్యాలెస్‌ హోటల్స్‌ని ఆమే నిర్వహిస్తున్నారు. మీ అందం వెనుక రహస్యం చెప్పండంటే 'ఏ స్త్రీకయినా అందంకంటే ఆరోగ్యమే ముఖ్యం. ఎండలు బాగా ఉండే మా ప్రాంతానికి డి విటమిన్‌కి మించిన ఔషధం ఏముంటుంది. గులాబీనీళ్లూ, అమ్మ స్వయంగా చేసే కాటుక' నా అందం వెనుక రహస్యాలు అంటారామె.

ఇదీ చదవండిః సేవలు చేస్తూ.. వ్యాపారవేత్తలై జీవితంలో గెలిచారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.