ETV Bharat / lifestyle

ప్రధాని మన్ననలు పొందిన ఐపీఎస్ కిరణ్‌శృతి గురించి మీకు తెలుసా?

author img

By

Published : Sep 5, 2020, 9:27 AM IST

ఐపీఎస్‌ కిరణ్‌బేడీ... పరిచయం అక్కర్లేని పేరు! ఐపీఎస్‌ కిరణ్‌శృతి... జాతీయ పోలీసు అకాడమీలో శుక్రవారం జరిగిన పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌కు నాయకత్వం వహించి ప్రతిష్ఠాత్మక ప్రధాని బ్యాటన్‌ అందుకొన్న ఐపీఎస్‌ అధికారిణి. ఈ ఇద్దరి పేర్లలో కామన్‌గా ఉన్న కిరణ్‌ యాదృచ్ఛికంగా వచ్చింది మాత్రం కాదు కిరణ్‌బేడీ ధైర్యసాహసాలని స్ఫూర్తిగా తీసుకుని తన కూతుర్ని కూడా అంతటి ఆఫీసర్‌ని చేయాలని కలలుకన్నారు డాక్టర్‌ రముల. అందుకే తన కూతురికి కిరణ్‌శృతి అనే పేరుపెట్టారు. బెస్ట్‌ పోలీస్‌ క్యాడెట్‌గా ప్రధాని మన్ననలు అందుకున్న కిరణ్​శృతి గురించి తెలుసుకుందాం.

kiran shruthi ips officer from tamilnadu
కిరణ్‌బేడీ స్ఫూర్తి.. కిరణ్‌శృతి ఐపీఎస్‌

మిళనాడులోని నాగర్‌కోయిల్‌కు చెందిన కిరణ్‌శృతి కుటుంబం.. వృత్తిరీత్యా చెంగల్‌పట్టులో స్థిరపడింది. తల్లిదండ్రులు రముల, దురైవెంకటేశన్‌లిద్దరూ డాక్టర్లు. వీళ్లకిద్దరు పిల్లలు. మొదటి సంతానం కిరణ్‌శృతి. తల్లి రములకు కిరణ్‌బేడీ అంటే చెప్పలేనంత అభిమానం. తనకు కూతురు పుడితే ఆమె పేరే పెట్టాలని, ఆమెలాగే గొప్ప పోలీస్‌ ఆఫీసర్‌ని చేయాలని కలలు కనేది.

ఆమె కలలు కన్నట్టుగానే మొదటి సంతానానికి కిరణ్‌ అనే పేరు పెట్టింది. ఆ పాపకి చిన్నతనం నుంచీ కిరణ్‌బేడీ గురించి నూరిపోసింది. ఆమె ధైర్యసాహసాలనే కథలుగా చెప్పేది. దాంతో ఆ అమ్మాయి కూడా పోలీస్‌ అవ్వాలనే కలలే కనేది. చెన్నైలోని ఠాగూర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఈసీఈ పూర్తి చేసి 2012లో ‘స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’లో ప్రొబెషనరీ ఆఫీసర్‌గా చేరింది శృతి.

‘ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన తర్వాత సివిల్స్‌ రాయాలనుకున్నా. బ్యాంకు ఉద్యోగం చేస్తూ సివిల్స్‌ ప్రయత్నాలు మొదలుపెట్టాను. కానీ అవి ఫలించలేదు. దాంతో ఆ ఉద్యోగం వదిలి దిల్లీ వెళ్లిపోయా. మూడు సార్లు రాసినా విఫలమయినా వెనక్కి తగ్గలేదు. నాలుగోసారి నాలోని లోపాలపై పూర్తిగా దృష్టి పెట్టాను. ఒత్తిడిని జయించి ఈసారి పక్కా ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం అయ్యాను. నా ప్రయత్నాలు ఫలించి... సివిల్స్‌ సాధించాను.

హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ తీసుకున్నా. నిజానికి అసలైన కష్టమంతా ఇక్కడే మొదలయ్యింది నాకు. శారీరకంగా నేనంత దృఢమైన వ్యక్తిని కాదు. దాంతో నన్ను నేను ఫిట్‌గా మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. నిత్యం నన్ను నేను ఉత్సాహపరుచుకుంటూ సాధించగలననే స్ఫూర్తిని నింపుకొనేదాన్ని. ఉదయం రెండు గంటలపాటూ మైదానంలో, సాయంత్రం మళ్లీ శిక్షణలో.. చాలా కష్టపడాల్సి వచ్చింది.

అయినా ఇష్టంతోనే ఆ కష్టాన్ని భరించేదాన్ని. ఆరు నెలలకోసారి వారం రోజుల పాటూ సెలవులుండేవి. ఆ సమయంలో మాత్రం అమ్మని వదిలి ఉండేదాన్నికాదు. ఇష్టమైన వంటలన్నీ అడిగి చేయించుకునేదాన్ని. నిజానికి మద్రాస్‌లోని ఇడ్లీ, సాంబార్‌ మిస్‌ అయినా...హైదరాబాద్‌ బిర్యానీ మాత్రం ఆ లోటు లేకుండా చేసింది. 2018లో చివర్లో ప్రారంభమైన మా శిక్షణ...ఈ ఏడాది జులైలో ముగిసింది.’ అంటోంది శృతి.

కిరణ్‌బేడీ అభినందించారు...

చిన్నప్పటి నుంచీ ఏ పోలీస్‌ అధికారిణిని స్ఫూర్తిగా తీసుకుని నేరస్థుల పాలిట సింహస్వప్నం అవ్వాలని శృతి కలలుకందో.. అదే పోలీస్‌ అధికారి కిరణ్‌బేడీ... ఈ పెరేడ్‌ దృశ్యాలను తన ట్విటర్‌ ఖాతాలో ఉంచి అభినందనలు తెలిపారు. ‘ఇంతకంటే సంతోషం ఏముంటుంది నాకు? ఎటువంటి ఇబ్బందులొచ్చినా ఈ శిక్షణకు ఎందుకొచ్చానా అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు నేను.

నా కష్టానికి ప్రతిఫలంగా 131 మంది ఉన్న మా బ్యాచ్‌లో నేను బెస్ట్‌ క్యాడెట్‌గా నిలవడం చాలా సంతోషంగా అనిపించింది. నేనీ స్థానంలో నిలబడటానికి కారణం మాకు శిక్షణందించిన ఆఫీసర్ల చేయూతే. పెరేడ్‌కు నాయకత్వం వహించడం, అలాగే ప్రధాని బ్యాటన్‌, హోం మినిస్టర్‌ రివాల్వర్‌ అందుకునే గౌరవాన్ని దక్కించుకోవడం నా జీవితంలో మర్చిపోలేని సంఘటనలు. ‘బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి, ఎందుకు ఐపీఎస్‌ ఆఫీసర్‌ కావాలనుకున్నావ’ని ప్రధాని నన్నడిగారు. అందుకు సమాధానంగా ‘కిరణ్‌బేడీ అంటే మా అమ్మకు చాలా ఇష్టం. అందుకే ఈ రంగంలోకి అడుగుపెట్టా’ అని బదులిచ్చా అంటోంది కిరణ్‌.

ఇవీ చూడండి: గురుపూజోత్సవం: పాఠమే ప్రాణం.. బడితోనే బంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.