ETV Bharat / jagte-raho

ఆలేరులో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి - ఆలేరు వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఆలేరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు ఇద్దరు వ్యక్తులను బలి తీసుకున్నాయి. మరో ఆరుగురు గాయాలపాలయ్యారు.

two-accidents-at-alair-in-yadadri-bhuvanagiri-district
ఆలేరులో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
author img

By

Published : Nov 3, 2020, 10:53 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఆరుగురు గాయాలపాలయ్యారు. ఆలేరు మండలం మందనపల్లి వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో నీల రాఘవులు అనే వ్యక్తి మృతి చెందారు. వ్యాపార పని నిమిత్తం ద్విచక్రవాహనంపై సోమవారం రాత్రి ఆలేరుకు వెళ్తున్న క్రమంలో మందనపల్లి స్టేజీ వద్ద ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన రాఘవులు ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

శారాజిపేట విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో సోమవారం రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎస్థైరా అనే మహిళకు తీవ్ర గాయాలు అయ్యి హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండు ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని స్థానిక ఎస్ఐ రమేష్ తెలిపారు.

ఇదీ చదవండి: 100 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.