యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కానుగంటి అనిల్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పటిలాగే.. శుక్రవారం రాత్రి గొర్రెల మంద కాపలాకు వెళ్లిన అనిల్.. అక్కడే చెట్టుకు ఉరివేసుకున్నాడు.
ఇంకా ఇంటికి రాలేదని చూడటానికి వెళ్లిన కుటుంబ సభ్యులకు చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
- ఇదీ చూడండి: నాగస్వరం కాయకోసం వచ్చి.. కటకటాల పాలయ్యారు