ETV Bharat / jagte-raho

విషాదం: విద్యుదాఘాతంతో యువరైతు మృతి - మేడ్చల్ జిల్లా తాజా వార్తలు

వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ యువరైతు మృతి చెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మేడ్చల్​ జిల్లాలో చోటుచేసుకుంది.

young man died due to current shock
విషాదం: విద్యుదాఘాతంతో యువరైతు మృతి
author img

By

Published : Sep 1, 2020, 2:26 PM IST

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్​పేట్ మండలం బొమ్మరాశిపేటలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై శ్రీపాల్​ రెడ్డి అనే యువ రైతు మృతి చెందాడు.

గ్రామానికి చెందిన మెడసాని శ్రీపాల్ రెడ్డి గేదెల కోసం తన పొలంలో గడ్డి కోయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో గట్టుపై తెగి పడి ఉన్న విద్యుత్ తీగలకు ప్రమాదవశాత్తు తగలడంతో విద్యుత్​ షాక్​కు గురయ్యాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న శామీర్​పేట ఎస్సై రవికుమార్​ ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కుమారుని అకాల మరణంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు.

ఇదీచూడండి.. కృష్ణానదిలో స్నానానికి వెళ్లి బ్యాంకు ఉద్యోగి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.