ఇంటి పక్కనున్న మరుగుదొడ్డికి వెళ్లి... సుచరిత అనే యువతి అదృశ్యమైంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కర్థనూరులో చోటుచేసుకుంది. ఈ మేరకు యువతి తండ్రి బీడీఎల్ భానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సుచరిత చందానగర్లో ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చుదువుతోంది. చాలాసేపటి వరకు తిరిగి రాలేదని చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: సచివాలయం హుందాగా, సౌకర్యవంతంగా ఉండాలి: సీఎం