యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రాళ్ళజనగాంలో పేకాట స్థావరాలపై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. గ్రామంలోని మల్లన్న ఆలయం వద్ద పేకాట ఆడుతుండగా... ఆరుగురిని పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. నిందితుల నుంచి రూ. 5,900 నగదు, నాలుగు ద్విచక్రవాహనాలు, ఆలు చరవాణీలు, ఆరు సెట్ల కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్టు యాదగిరిగుట్ట పోలీసులు తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిచే గ్రామస్థులు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
ఇదీ చూడండి: ఆయన ప్రాణం కాపాడండి: వరవరరావు సతీమణి హేమలత