మేడ్చల్ జిల్లా నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన వెంకటేష్‌కు కొద్దికాలం క్రితం కరోనా వైరస్ సోకింది. చికిత్స పొందుతూ మరణించాడు. భర్త మరణం తట్టుకోలేని భార్య ధనలక్ష్మి తాము నివసిస్తున్న బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
జీవితాంతం తోడుంటాడని మాటిచ్చిన భర్త కరోనా వ్యాధి వల్ల అర్థాంతరంగా తనను వదిలి వెళ్లిపోవడం ఆ మహిళ జీర్ణించుకోలేకపోయింది. భర్త లేని జీవితం వద్దనుకోని బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు