నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో దారుణం జరిగింది. స్థానిక ఓవైసీనగర్లో నివాసముంటున్న మున్నా బేగం అనే మహిళపై మేనల్లుడు రాడ్డుతో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను నిజామాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మృతురాలు మున్నాబేగం తన తమ్ముడికి భార్యతో విభేదాలు రావడంతో కొద్ది రోజుల క్రితమే అతనికి రెండో పెళ్లి చేసింది. దీంతో మొదటి భార్య కుమారులు కోపంతో మేనత్త మున్నా బేగం ఇంటికి వెళ్లి రాడ్డుతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.