ఓ వివాహిత అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్ తుకారాంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆమె ఈనెల 24న పనికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిందని కుటుంబసభ్యులు తెలిపారు. మారేడుపల్లి టీచర్స్ కాలనీలో ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తోందని అన్నారు. ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీసినప్పటికీ ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు. ఆమె ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు చెప్పారు. అదృశ్యం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: చెరువులో మహిళ మృతదేహం... ఆత్మహత్యా లేక హత్యా ?