మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగార్జున నగర్ కాలనీలో నివాసముంటున్న దంపతులు సంతోశ్ గుప్తా- స్వాతి.. కొంతకాలంగా గొడవలు పడుతున్నారు. వేధింపులు తాళలేక మూడు రోజుల క్రితమే స్వాతి తన భర్తపై స్థానిక పీఎస్లో ఫిర్యాదు చేయగా... వివిధ సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదు చేశారు కాని అరెస్ట్ చేయలేదు. పోలీసుల తీరుతో మనస్తాపం చెందిన బాధితురాలు పోలీస్ స్టేషన్ ముందే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డింది. గమనించిన పోలీసులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
మూడు రోజులుగా పీఎస్ చుట్టు తిరుగుతున్నా పోలీసులు స్పందించకపోవడం వల్లే స్వాతి ఆత్మహత్యకు యత్నించారని కంట్రోల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ డిటెక్టివ్ ఏజెన్సీ ఛైర్పర్సన్ పావని ఆరోపించారు. నిత్యం వేధింపులకు గురిచేస్తున్న గుప్తాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన కారు.. నిందితులు పరార్
Woman commits suicide case ignored by police