మెదక్ జిల్లా నందిగామ గ్రామానికి చెందిన రేవతి.. రెండేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో తనకు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తుండగా అనారోగ్యం కారణంగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
మంటను భరించలేక రేవతి వేసిన కేకలను స్థానికులు గమనించి వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆమె మరణించింది. మృతురాలి తల్లి సుమలత ఫిర్యాదు మేరకు నిజాంపేట ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్, భాజపాకు ఓటు వేస్తే అంతే: హరీశ్ రావు