ETV Bharat / jagte-raho

వాట్సప్​ స్టేటస్​లో పడకగది ఫొటోలు... భార్య ఆత్మహత్యాయత్నం - jagityal news

పడకగదిలో తీసుకున్న ప్రైవేటు ఫొటోలను భర్త వాట్సప్​ స్టేటస్​లో పెట్టాడన్న అవమానంతో భార్య శానిటైజర్​ తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్​లో చోటుచేసుకుంది.

వాట్సప్​ స్టేటస్​లో పడకగది ఫొటోలు... భార్య ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Oct 3, 2020, 12:02 PM IST

భర్త వేధింపులతో పాటు పడక గదిలో తీసుకున్న ఫొటోలను వాట్సాప్‌ స్టేటస్‌లో అప్​లోడ్​ చేయటం వల్ల... అవమానం భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మెట్‌పల్లికి చెందిన రఫికి లక్ష్మీపూర్‌కు చెందిన యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది. గత కొంతకాలంగా కట్నం కోసం భర్త వేధింపులకు పాల్పడుతున్నాడు.

అంతేగాక... పడక గదిలో తీసుకున్న ఫొటోలను పైశాచికంగా వాట్సాప్‌ స్టేటస్‌లో అప్​లోడ్‌ చేశాడు. అవమానం భరించలేక వివాహిత ఇంట్లో ఉన్న శానిటైజర్‌ తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు బాధితురాలిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై జగిత్యాల రూరల్‌ పోలీసులు భర్త రఫిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఎస్సీ యువకుడి లాకప్​డెత్​... మధ్యవర్తితో రాజీయత్నం...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.