కొత్త సంవత్సర వేడుకలే లక్ష్యంగా డ్రగ్స్ పంపిణీకి పోలీసులు చెక్ పెట్టారు. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున మత్తు పదార్థాలను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
10లక్షల విలువైన 10గ్రాముల ఎండీఎంఏ, 75 ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్60 ఈక్సీటాసీ పిల్స్ మత్తు పదార్థాలతోపాటు కిలో హాసిష్ ఆయిల్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి తదుపరి విచారణ నిమిత్తం తుకారాం గేట్ పోలీసులకు అప్పగించారు. ముంబాయిలో తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి ఎక్కువ ధరకు హైదరాబాద్‌లో విక్రయించేందుకు వీటిని తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:అర్ధరాత్రి 'వకీల్‌సాబ్' అప్డేట్