ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి వి.భాస్కర రమణమూర్తి ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బలవన్మరణానికి గల కారణాలపై అతని భార్య, సన్నిహితులను ఎల్బీనగర్ పోలీసులు విచారిస్తున్నారు.
గత రాత్రి ఒంటిగంట సమయంలో భాస్కర రమణమూర్తి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. రెండవ అంతస్తులోని ఆయన నివాసం, అపార్టుమెంట్ వద్ద సీసీటీవీ కెమెరాల దృశ్యాలను సేకరించారు.
భాస్కర రమణమూర్తికి కార్యాలయంలో చిన్న సమస్యలు తప్ప ఆత్మహత్య చేసుకునేంత పెద్ద సమస్యలు ఏమీ లేవు. ప్రస్తుతం రెండు నెలలుగా రమణమూర్తి సెలవులో ఉన్నారు. గుంటూరు అరణ్య భవన్లో ప్రిన్సిపల్ ఛీఫ్ కన్జర్వేటివ్ అధికారిగా పనిచేస్తున్నారు. గత పది సంవత్సరాలుగా నాగోల్ బండ్లగూడలోని రాజీవ్ స్వగృహ అపార్టుమెంట్లో కుటుంబంతో సహా నివసిస్తున్నారు.
-రాజు, రమణమూర్తి స్నేహితుడు.
అర్ధరాత్రి వేళ ఒంటి గంట సమయంలో పెద్ద అపార్టుమెంట్ సముదాయంలో పెద్ద శబ్ధం వచ్చింది. వచ్చి చూస్తే సార్ నేలపై పడిఉన్నారు. కుటుంబ సభ్యులతో సహా పోలీసులకు సమాచారం ఇచ్చాను.
-అప్పారావు, వాచ్‌మెన్
ఇవీచూడండి: హైదరాబాద్‌లో ఏపీ ఐఎఫ్‌ఎస్ అధికారి అత్మహత్య