కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చినందుకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద తనను బెదిరిస్తున్నారని వీఆర్వో శ్యామ్‌కుమార్ ఆరోపించారు. ఫోన్ చేసి తిట్టడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించాలని పోలీసులన వేడుకున్నారు.
ఇవీ చూడండి: మాజీ ఎమ్మెల్యే వరదరాజులు కుమారుడు, అనుచరులపై కేసు నమోదు