ETV Bharat / jagte-raho

'హత్య చేసి మృతదేహాన్ని గోనె సంచిలో దాచిపెట్టారు' - Nizamabad murder case

ఓ వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేసి మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టిన సంఘటన నిజామాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది. అటుగా వెళ్లిన పశువుల కాపరులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

Nizamabad murder case
నిజామాబాద్​లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
author img

By

Published : Oct 27, 2020, 7:56 PM IST

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప శివారులో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన పశువుల కాపరులు తెల్లని సంచిలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సంచి తెరవగా.. 25-30 ఏళ్ల వయస్సు మధ్యగల వ్యక్తి మృతదేహం బయటపడింది.

అతని శరీరంపై కత్తిపోట్లు ఉండటం వల్ల ఎవరో హత్య చేసి సంచిలో పెట్టి అడవిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.