ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్న సుంకరి సంతోష్, గుండ్రెడ్డి వేణుగోపాల్ రోజూలాగే విధులకు వచ్చారు. కార్యాలయం పక్క నుంచి ఇనుప నిచ్చెన తీసుకువెళ్ళే క్రమంలో భవనానికి అత్యంత చేరువలో ఉన్న 11కేవీ విద్యుత్ తీగలకు తగిలింది. విద్యుత్ ప్రసరించి నిచ్చెన్ని పట్టుకు వెళ్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
ప్రమాదానికి కారణాలేంటి
ఘటనా ప్రదేశానికి చేరుకున్న మృతుల కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తక్కువ ఎత్తులో విద్యుత్ తీగలు ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తదుపరి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా ఫ్యాక్టరీ పరిసరాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:విద్యార్థిని కంట్లో పెన్సిల్తో దాడి