మరో రెండు గంటల్లో ప్రవేశ పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సిన విద్యార్థిని రహదారి ప్రమాదంలో మృతి చెందింది. హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనాగూడ బస్టాప్ వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ వెనుక నుంచి ఢీకొట్టడం వల్ల ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. జహీరాబాద్‌లోని బాగారెడ్డిపల్లికి చెందిన శ్వేత డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్ ప్రవేశ పరీక్ష రాయడానికి జహీరాబాద్ నుంచి తన బంధువైన శ్రీనివాస్‌తో తెల్లవారుజామున బయలుదేరింది. మౌలాలిలోని పరీక్షా కేంద్రానికి మరో అరగంటలో చేరుకోవాల్సి ఉంది.
కానీ అంతలోపే లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. సంఘటనా స్థలంలోనే మూర్తి చెందిన శ్వేత, శ్రీనివాస్ మృతదేహాలను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో ఆస్పత్రికి చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: కృష్ణా నదిలో నలుగురు గల్లంతు.. ఒకరు మృతి