ETV Bharat / jagte-raho

వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు... మృతి - సంగారెడ్డి వార్తలు

జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామంలో విషాదం జరిగింది. బుధవారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పితిరి వాగు దాటుతున్న ఇద్దరు గల్లంతయ్యారు. గురువారం ఉదయం వాగులో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.

పితిరి వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు మృతి
పితిరి వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు మృతి
author img

By

Published : Sep 17, 2020, 11:10 AM IST

వాగు దాటుతుండగా గల్లంతయిన ఇద్దరు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ మండలం సత్వార్​లో జరిగింది. బుధవారం కురిసిన భారీ వర్షానికి పితిరి వాగు ఉప్పొంగడం వల్ల వాగు దాటుతున్న ఎర్రోళ్ల రాజు, న్యాల్కల్ మండలం హద్నూర్​కు చెందిన రాజు కొట్టుకుపోయారు.

అర్ధరాత్రి వరకు గ్రామస్థులు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం ఉదయం వాగులో వెతుకుతుండగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో హద్నూర్​కు చెందిన రాజు అత్తగారి ఇంటికి వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. వాగుపై వంతెన నిర్మించాలని పలుమార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వాగుపై వంతెన నిర్మించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: భద్రాచలం కేంద్రంగా రాష్ట్రాలు దాటుతోన్న గంజాయి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.