ఏపీలోని విశాఖ జిల్లా పాడేరు మండలం మగతపాలెం వద్ద రాత్రి బొలేరో వాహనం బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో యువకుడు మరణించాడు. ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. వివాహ వేడుకకు హాజరై తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఇదీ చదవండి: ఎదురెదురుగా వెళ్తున్న ద్విచక్రవాహనాలు ఢీ.. ఒకరు మృతి