ఇద్దరు డ్రైవర్ల నిర్లక్ష్యం అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలికొన్నాయి. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఒకరు.. టిప్పర్ ఢీకొట్టి మరొకరు దుర్మరణం చెందారు.
పోలీస్ వాహనం ఢీకొని..
మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సీతారాంబాగ్ కూడలి వద్ద ఏడేళ్ల బాలుడు హర్షవర్ధన్‌ను పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్ ఘటనా స్థలాన్ని సందర్శించారు.
టిప్పర్ చక్రాల కింద నలిగి..
చంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడేళ్ల బాలికను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనం చక్రాల కింద పడి బాలిక అక్కడికక్కడే దుర్మరణం చెందింది.
వాహన ఛోదకుల నిర్లక్ష్యమే ఇరు కుటుంబాల్లో విషాదానికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఇవీచూడండి: చిన్నారిని ఢీ కొట్టిన టిప్పర్ లారీ.. చికిత్స పొందుతూ మృతి