ETV Bharat / jagte-raho

నకిలీ ఇన్‌ వాయిస్‌లతో రూ.14.20 కోట్లు కాజేశారు! - హైదరాబాద్​లో జీఎస్టీ కేసులు

ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పేరుతో రూ.14.20 కోట్లు కాజేసిన నిందితులు అరెస్టు అయ్యారు. ఆరు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించారు. మరో రూ.3.15 కోట్లు జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. నిందితులకు ఆర్థిక వ్యవహారాల ప్రత్యేక కోర్టు ఈనెల 25 వరకు రిమాండ్‌ విధించింది.

gst arrest
gst arrest
author img

By

Published : Jan 13, 2021, 10:43 PM IST

నకిలీ ఇన్‌ వాయిస్‌లు సృష్టించి రూ.14.20 కోట్ల ఐటీసీ సొమ్మును స్వాహా చేసిన ఇద్దరు అక్రమార్కులను సికింద్రాబాద్‌ సీజీఎస్టీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గుజరాత్‌కు చెందిన కుతుబ్‌దీన్‌, అలీసాగర్‌లు వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వీరు 2018-19 ఆర్థిక ఏడాదిలో నేషనల్‌ హార్డ్‌వేర్‌ ట్రేడింగ్‌ కంపెనీ, ప్లాటినం ట్రేడింగ్‌ సిండికేట్‌, మార్వెల్‌ ఇండస్ట్రియల్‌ కార్పొరేషన్‌, జూపిటర్‌ ట్రేడింగ్‌ కంపెనీ, బీఐ ఎంటర్‌ప్రైజెస్‌, యూనివర్షల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేర్లతో ఆరు బోగస్‌ సంస్థలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్లు...నకిలీ ఇన్‌ వాయిస్‌లను, ఈ వే బిల్లులను సృష్టించారు.

ఇలా వెలుగులోకి

దాదాపు పది నెలలపాటు ఈ సంస్థల ద్వారా సృష్టించిన నకిలీ ఇన్‌ వాయిస్‌లతో ఇన్​పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పేరున రూ.14.20 కోట్ల ప్రభుత్వ సొమ్మును నొక్కేశారు. అప్పటికే ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తుండడంతో... ఈ ఆరు డొల్ల కంపెనీలను మూసివేశారు. వాటికి సంబంధించి ఏలాంటి రిటర్న్‌లు దాఖలు కాకపోవడంతో... అనుమానం వచ్చిన అధికారులు... ఆరా తీయగా ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

నిందితులకు రిమాండ్​

మరో రూ.3.15 కోట్ల జీఎస్టీ చెల్లింపులను కూడా వీరు ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించారు. మంగళవారం వారిద్దరిని అరెస్టు చేసి సికింద్రాబాద్‌ ఆర్థిక వ్యవహారాల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పెట్టగా ఈ నెల 25వ తేదీ వరకు నిందితులకు రిమాండ్‌ విధించినట్లు సికింద్రాబాద్‌ సీజీఎస్టీ కమిషనర్‌ ఎంఆర్​ఆర్‌ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి : రుణయాప్​ల దందాలో ప్రధాన సూత్రదారి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.