ETV Bharat / jagte-raho

వేడినీరు మీద పడి మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు - రాంపూర్​లో వేడినీళ్లు పడి చిన్నారికి గాయాలు

వేడినీరు మీద పడి ఓ మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని ఓ ప్రైవేట్​ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన వరంగల్ అర్బన్​ జిల్లాలో చోటుచేసుకుంది.

three-years-baby-injured-due-to-hot-water-poured-on-her-body-in-warangal-urban-district
వేడినీరు మీద పడి మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు
author img

By

Published : Sep 25, 2020, 1:51 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం రాంపూర్​లో విషాదం చోటుచేసుకుంది. వేడినీరు మీద పడి హర్షిణి అనే మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.

గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తి తన కూతురు హర్షిణికి స్నానం చేయించేందుకు బకెట్​లో వేడినీటిని తీసుకెళ్లి స్నానాల గదిలో పెట్టాడు. చిన్నారి పరుగెత్తుకు వెళ్లి బకెట్​ను తన వైపుకు వంపుకుంది. ఈ క్రమంలో వేడి నీరు మీదపడి చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.

గమనించిన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం చిన్నారిని హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హర్షిణిని పరిశీలించిన వైద్యులు 50 శాతానికి పైగా శరీరం కాలినట్లు తెలిపారు. ప్రస్తుతం చిన్నారి క్షేమంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: అన్నను కడతేర్చిన తమ్ముడు… మానసిక హింస భరించలేకే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.