ETV Bharat / jagte-raho

ఆ తల్లి కూడా మృతి చెందింది - పిల్లలకు విషమిచ్చిన తల్లి మృతి

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో చికిత్స పొందుతున్న తల్లి శుక్రవారం మృతిచెందింది. భార్యాభర్తల మధ్య తగాదాలతో షామీర్​పేట్​ ఠాణా పరిధిలో రెండు రోజుల కిందట ఓ మహిళ పిల్లలను చంపి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పిడిన ఘటన తెలిసిందే.

The mother death who attempted suicide by poisoning
ఆ తల్లి కూడా మృతి చెందింది
author img

By

Published : May 23, 2020, 3:17 PM IST

మేడ్చల్​ జిల్లా షామీర్​పేట్ ఠాణా పరిధిలో రెండు రోజుల క్రితం కుటుంబ కలహాలతో ఓ మహిళ పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరు పిల్లలు మృతి చెందగా... కొనఊపిరితో ఆమెను ఆస్పత్రిలో చేర్చించారు. చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం విషమించి శుక్రవారం మృతి చెందింది.

షామీర్​పేట్​లోని అలియాబాద్ శివారులో ఉంటున్న గోపీనాథ్, ప్రీతికి ఇద్దరు సంతానం. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య తరచు గొడవలు జరిగేవి. ఈ క్రమంలో బుధవారం కూడా ఇద్దరి మధ్య తగాదా జరిగింది. మనస్తాపం చెందిన ప్రీతి... బుధవారం సాయంత్రం పిల్లలిద్దరికీ విషం ఇచ్చి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిల్లలు మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న ఆమెను మేడ్చల్​లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడం వల్ల అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: పిల్లలకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.