సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని గణేష్ దేవస్థానానికి చెందిన గోశాలలోని 5 గోవులను గుర్తుతెలియని దుండగులు దొంగతనంగా తరలించుకెళ్లారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రుద్రారం శివార్లలో ఉన్న గణేష్ దేవస్థానంలో ఈ నెల 27న తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ఐదు గోవులను తరలించుకుపోయినట్టు గుర్తించారు. ఆలస్యంగా గుర్తించిన దేవాలయ నిర్వాహకులు గోవుల కోసం చుట్టుపక్కల వెతికారు. వాటి జాడ తెలియకపోవటంతో.. సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఓ టర్బో వాహనం అనుమానస్పదంగా తిరిగిన దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో నమోదయ్యాయి. దుండగులు ఇదే వాహనాల్లో గోవుల్ని తీసుకెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య