నిజామాబాద్ రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ఫోర్స్ పోలీసులు గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. కొందరు వ్యక్తులు అక్రమంగా ఇంట్లో, గోదాముల్లో గుట్కాను నిల్వ చేస్తున్నారని సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించారు.
తనిఖీల్లో రూ.60 వేల విలువ చేసే గుట్కాను సీజ్ చేసినట్లు టాస్క్ఫోర్స్ సీఐ షాకేర్ అలీ తెలిపారు. నిందితులు నిసార్, అల్మాస్పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: రెండు ద్విచక్రవాహనాలు ఢీ... అక్కడికక్కడే ఇద్దరు మృతి