హైదరాబాద్ కార్వాన్ రాంసింగాపూర్లో జరిగిన దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు, మరో బాల నేరస్థున్ని అరెస్ట్ చేశారు. ఈ నెల 22న రాత్రి 11గంటల సమయంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని కొట్టి... చరవాణి, 2వేళ నగదును నిందితులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
కేసు నమోదు చేసిన టప్పాచబుత్ర పోలీసులు... సీసీ కెమెరాల ఆధారంగా నిందుతులను గుర్తించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని.. రెండు ద్విచక్ర వాహనాలతోపాటు 2 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.