ETV Bharat / jagte-raho

సబ్​స్టేషన్​లో చోరీ: ఆపరేటర్​ను చితకబాది నగదు అపహరణ

నిజామాబాద్​ జిల్లా కుద్వాన్​పూర్​ సబ్​స్టేషన్​లో చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి విద్యుత్​ ఉపకేంద్రంలోకి చొరబడిన దుండగులు.. ఆపరేటర్​పై దాడికి పాల్పడి నగదు అపహరించుకుపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Substation theft: Crushing the operator and stealing cash
సబ్​స్టేషన్​లో చోరీ: ఆపరేటర్​ను చితకబాది నగదు అపహరణ
author img

By

Published : Sep 6, 2020, 1:48 PM IST

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కుద్వాన్​పూర్ విద్యుత్​ ఉపకేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గంగాధర్ అనే ఆపరేటర్​ను చితకబాది నగదు అపహరించుకుపోయారు.

శనివారం అర్ధరాత్రి కొందరు దుండగులు వచ్చి తలుపులు పగులగొట్టి తనపై కర్రలతో దాడి చేశారని బాధితుడు పేర్కొన్నాడు. గదిలోని వస్తువులు చిందరవందరగా పడేసి.. నగదును ఎత్తుకెళ్లారని ఆరోపించాడు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Substation theft: Crushing the operator and stealing cash
సబ్​స్టేషన్​లో చోరీ: ఆపరేటర్​ను చితకబాది నగదు అపహరణ

ఇదీచూడండి.. పెట్రో మోసం... లీటరుకు 30 మి.లీ. తక్కువ పోసేస్తున్నారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.