దిల్లీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని ఆర్థిక పరిస్థితులు సరిగా లేక.. చదువు భారమై ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఫరూక్‌నగర్‌లో నివాసం ఉండే మెకానిక్ శ్రీనివాసరెడ్డి, సుమతిల కుమార్తె ఐశ్వర్య రెడ్డి ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయి ర్యాంకును సాధించి దిల్లీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌లో ఉచిత సీట్ సాధించింది.
అగ్రవర్ణ విద్యార్థి కావడం వల్ల ప్రభుత్వ పరంగా ఆర్థిక సహకారం లేకపోవడం వల్ల హాస్టల్లో ఉండి చదవడం పెనుభారంగా మారింది. మానసికంగా బాధపడిన ఈ విద్యార్థిని ఈ నెల 3న ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు సీఐ శ్రీధర్ కుమార్ తెలిపారు.
