సమాజం ఆమోదించని ఓ సంబంధం ఆ చిన్నారికి మరణశాసనం రాసింది. తల్లిపై ద్వేషంతో ఆరేళ్ల ఆడబిడ్డ గొంతు కోసి క్రూరంగా చంపేశాడా ఉన్మాది. నగర శివార్లలోని ఇస్మాయిల్‌గూడాకు చెందిన కల్యాణ్- అనుషా దంపతుల జీవితాల్లో నిప్పులు కుమ్మరించిన ఈ ఘటన సమాజంలో పతనం అవుతున్న విలువలను తెలియచేస్తోంది.
అనూష తన భర్త కల్యాణ్ లేని సమయంలో కరుణాకర్ అనే పరిచయస్తుడితోనూ... అతని స్నేహితుడు రాజశేఖర్‌తోనూ ఒకరికి తెలియకుండా ఒకరితో సాగించిన స్నేహం వారి కుటుంబాన్ని కాలరాసింది. తనకు ఏమార్చి తన స్నేహితుడు రాజశేఖర్‌తో సంబంధం కొనసాగించడాన్ని సహించలేని కరుణాకర్ కిరాతకుడిలా మారి అనూష ఏకైక కుమార్తె ఆరేళ్ల ఆద్యను దారుణంగా చంపేశాడు. అనూష పైనా... ఆమెతో కలిసి ఉన్న రాజశేఖర్ పైనా కత్తితో దాడి చేశాడు.
ఎంతో గారాబంగా పెంచిన చిట్టితల్లి ఆద్య హత్యకు గురవటం వల్ల తండ్రి హృదయం తల్లడిల్లిపోయింది. మరోపక్క భార్య ప్రవర్తనతో తలెత్తుకోలేకు తీవ్ర కుంగుబాటుకు గురైన ఆమె భర్త కల్యాణ్... భువనగిరి వద్ద రైలుపట్టాలపై పడి ప్రాణాలు తీసుకున్నాడు. తాత్కాలిక సుఖాల కోసం కుటుంబాన్ని నాశనం చేసుకున్న అనూష, క్షణికావేశంతో విలువైన జీవితాన్ని అంతం చేసుకున్న కల్యాణ్ ఉదంతాలు కొందరికైనా కనువిప్పుగా మారాలి.
సంబంధిత కథనాలు: