ETV Bharat / jagte-raho

దివ్యాంగురాలి సజీవ దహనం కేసులో సంచలన విషయాలు చెప్పిన ఎస్పీ

దివ్యాంగురాలు భువనేశ్వరి సజీవ దహనం కేసు వివరాలను ఏపీ ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ ఒంగోలులో వెల్లడించారు. కష్టాలకు ఓర్వలేక మనస్థాపానికి గురైన భువనేశ్వరి.. ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన తెలిపారు.

bhuvaneshwari
భువనేశ్వరిది ఆత్మహత్యే: ప్రకాశం ఎస్పీ సిద్దార్థ కౌశల్
author img

By

Published : Dec 21, 2020, 7:44 PM IST

ఆంధ్రప్రదేశ్​లో దివ్యాంగురాలు భువనేశ్వరి సజీవ దహనం కేసు వివరాలను ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ వెల్లడించారు. భువనేశ్వరి వ్యక్తిగత సమస్యలతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని ఎస్పీ తెలిపారు. "ఈ నెల 18న తన స్నేహితుడైన ఓ ఆటో డ్రైవర్‌ ద్వారా పెట్రోలు కొనుగోలు చేసి ట్రైసైకిల్‌ మీద దశరాజు పల్లి రహదారివైపు వెళ్లింది. ఆమె వెళ్లడం సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ప్రత్యక్ష సాక్షులు కూడా ఈ విషయాన్ని చెప్పారు. రాత్రి 8.49 నిమిషాలకు డయల్ 100కు ఫోన్‌ రావడంతో అప్రమత్తమైన పోలీసులు, ఫైర్ సిబ్బంది వెళ్లేసరికే భువనేశ్వరి పూర్తిగా కాలిపోయి మృతి చెందింది" అని ఎస్పీ చెప్పారు.

ఆత్మహత్యకు ముందు.. స్నేహితులకు సందేశం

ఆమె దివ్యాంగురాలు కావడం, ఆర్థికంగా ఇబ్బందులు ఉండటం.. చిన్నతనంలోనే తండ్రి మృతి చెందడం... తన అక్క అనారోగ్యానికి గురికావటం వంటి పరిణామాలతో తీవ్ర మనోవేదన చెందినట్టు గుర్తించామని ఎస్పీ చెప్పారు. ఈ పరిస్థితులు తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఓ యాప్‌ ద్వారా 8 మంది స్నేహితులు గ్రూప్‌ను ఏర్పాటు చేసి చాట్‌ చేసుకుంటున్నారని తెలిపారు. గత 15 రోజుల నుంచి తన జీవితానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందంటూ ఆ గ్రూపులో ప్రతిరోజు భువనేశ్వరి మెసేజ్‌ ఇస్తుండేదని ఆత్మహత్యకు కొద్ది నిమిషాలకు ముందు కూడా ఇదే ఆఖరి మెసేజ్‌ అని పేర్కొందని ఎస్పీ వివరించారు.

భువనేశ్వరిది ఆత్మహత్యే: ప్రకాశం ఎస్పీ సిద్దార్థ కౌశల్

'సమాచారం ఇస్తే కాపాడేవాళ్లం'

అయితే 15 రోజులుగా ఆమె ఇలాంటి మెసేజ్‌లు పెడుతున్నా, స్నేహితులు ఆమె మానసిక స్థితిని అంచనావేయకపోవడం, ఆత్మహత్యను ఆపే ప్రయత్నం చేయకపోవడం బాధాకరమని ఎస్పీ అన్నారు. కనీసం పోలీసులకు సమాచారం ఇచ్చినా, కౌన్సిలింగ్‌ చేసేవాళ్లమని పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందనే విషయం స్పష్టంగా తెలుస్తున్నా, కొంతమంది లేనిపోని వదంతులు, ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఆసరా పింఛన్లకు నిధుల మంజూరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.