సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్స్టేషన్ పరిధిలోని వాల్మీకినగర్కు చెందిన రాజు బోయిన్పల్లి మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. ఈనెల 4న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పికెట్లోని వెల్లింగ్టన్ రోడ్డు మార్గంలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. ఇద్దరు దుండగులు అడ్డగించారు.
రాజు వద్ద ఉన్న రూ.50 వేలతో పాటు వాహనాన్ని లాక్కొని దాడి చేయడానికి ప్రయత్నించగా... తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు చేశారు. దాడి చేసిన వారు... మారేడ్ పల్లికి చెందిన ఆమన్ (25), పికెట్కు చెందిన ఫాస్ట్ఫుడ్ వ్యాపారి మ్యాథ్యూస్(40)గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
తమదైన శైలిలో విచారించగా... నిందితులు అసలు విషయం బయటపెట్టారు. వ్యాపారం, కుటుంబ తగాదాల కారణంగా తండ్రిపై దాడి చేయించింది అతని కన్న కొడుకేనని తెలిపారు. తన స్నేహితునితో కలిసి దాడి చేసి నగదు దొంగిలించి ఇవ్వాలని తమకు సుఫారీ ముట్టజెప్పాడని వెల్లడించారు. ఇంత పథకం పన్నిన ఆ కొడుకును సైతం పోలీసులు అరెస్టు చేశారు.