ఎంతో ప్రేమగా పెంచుకున్న మొక్కకు ఏమైనా అయితేనే ప్రాణం అల్లాడి పోతుంది. అలాంటిది అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను రోజూ అల్లుడు చిత్రహింసలు పెడుతుంటే చూస్తూ ఏ తండ్రి అయినా ఊరుకోగలడా... బిడ్డను ఎందుకు కొడుతున్నావని ప్రశ్నించినందుకే ఓ వ్యక్తి తన అల్లుడి చేతిలో హత్యకు గురయ్యాడు.
వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండలం పెద్ద చెరువులో గత వారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిని వరంగల్ గ్రామీణ జిల్లా నడికుడి మండలం కంఠాత్మకూర్‌కు చెందిన ఎల్లయ్యగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో అల్లుడే హంతకుడిగా నిర్ధరించారు. కుమార్తెను సరిగ్గా చూడట్లేదని మామ ప్రశ్నించడం వల్ల ఆవేశంలో హత్య చేశానని విచారణలో నిందితుడు చెప్పాడని పోలీసులు తెలిపారు. ఘటనలో నిందితుడు వెంకటేష్‌ను అరెస్ట్ చేసి... గొడ్డలి, ద్విచక్రవాహనం స్వాధీనపరుచుకున్నారు.
ఇదీ చూడండి: ఇంటికి కన్నం వేసిన ఫేస్బుక్ మిత్రుడు