ETV Bharat / jagte-raho

తండ్రి వివాహేతర సంబంధం... కుమారుడు ఆత్మహత్యాయత్నం - గుంటూరులో కుమారుడు అత్మహత్యాయత్నం

వివాహేతర సంబంధాన్ని నిలదీసిన కుమారుడుతో ఘర్షణకు దిగాడు ఆ తండ్రి. దీంతో మనస్థాపం చెందిన కుమారుడు..పెట్రోలు పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన అతడి పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. ఈ ఘటన గుంటూరు నగరంలో కలకలం రేపింది.

son-commits-suicide-in-guntur-city-over-father-adultery
ఏపీ: తండ్రి వివాహేతర సంబంధం తెలిసి కుమారుడు ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Aug 15, 2020, 8:20 PM IST

తండ్రి వివాహేతర సంబంధంపై కుమారుడు నిలదీశాడు. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి..నన్నే నిలదీస్తావా? అంటూ కుమారుడితో ఘర్షణకు దిగాడు. ఇది కాస్తా... కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడే వరకు వచ్చింది. గుంటూరు నగరంలోని కొండా వెంకటప్పయ్య కాలనీలో జరిగిన ఈ ఘటన.. స్థానికంగా కలకలం రేపింది.

పోలీసు శాఖలో ఏఎస్​ఐ

చుట్టుగుంట సమీపంలోని కొండా వెంకటప్పయ్య కాలనీకి చెందిన సాతులూరు థామస్... పోలీసు శాఖలో డాగ్ స్క్వాడ్ లో ఏ.ఎస్.ఐ గా పనిచేస్తున్నారు. కొంత కాలం క్రితం ఆయన భార్య మరణించారు. దీంతో థామస్ వేరే మహిళతో సహజీవనం చేస్తున్నారు. దీనిపైన థామస్ కుమారుడు సంజీవ్ కుమార్ తండ్రిని నిలదీశారు.

నన్నే నిలదీస్తావా...?

తన పుట్టినరోజు నాడు కూడా ఇంటికి రాకపోవటాన్ని కుమారుడు సంజీవ్​కుమార్ తప్పుబట్టాడు. కోపోద్రిక్తుడైన తండ్రి నన్నే నిలదీస్తావా..? అంటూ కొడుకు సంజీవ్​తో ఘర్షణకు దిగాడు. దీంతో మనస్థాపం చెందిన సంజీవ్ పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుమారుడిని కాపాడే క్రమంలో తండ్రి థామస్​కు కూడా స్వల్ప గాయాలయ్యాయి.

పరిస్థితి విషమం...

సంజీవ్​ను హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శరీరం 90శాతం మేర కాలిపోవటంతో సంజీవ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బీటెక్​ పూర్తి చేసిన సంజీవ్...ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. అతని సోదరుడు బెంగళూరులో ఉంటున్నాడు. విచారణ చేపట్టిన పోలీసులు.. దీనిపై ఇంకా కేసు నమోదు చేయలేదు.

ఇదీ చదవండి: త్వరలోనే మూడు రాజధానులకు శంకుస్థాపన చేస్తాం: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.