బంగారం దుకాణంలో అరకిలో వెండి ఆభరణాల దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలోని ఓ బంగారం దుకాణంలో ఈ నెల 11న అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల సహాయంతో నిందితుడిని గుర్తించారు. ఆభరణాలను అమ్మేందుకు వరంగల్ వెళ్తుండగా బస్టాండ్లో దొంగని అదుపులోకి తీసుకున్నారు. వెండిని స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు.
నిందితుడు రేగొండకు చెందిన యాట రాములుగా పోలీసులు గుర్తించారు. వ్యసనాలకు బానిసై దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఆగి ఉన్న స్కూటీని ఢీ కొట్టిన వ్యాను.. ఒకరు మృతి