సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్ పరిధిలోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలో భారీ చోరీ జరిగింది. దుకాణం వెంటిలేటర్ గ్రిల్స్ తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగుడు.. దాదాపు 1.20 కిలోల బంగారం ఎత్తుకెళ్లాడు.
పాట్ మార్కెట్‌కు చెందిన అనిల్ జైన్.. అదే ప్రాంతంలో నేమిచంద్ జైన్ జ్యువెలరీ పేరుతో బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన షాప్‌కు వచ్చి చూడగా.. ఆభరణాలు, సామగ్రి చిందరవందరగా పడి ఉన్నాయి. చోరీ జరిగినట్లు గుర్తించిన అనిల్.. మహంకాళి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. క్లూస్‌టీమ్, డాగ్‌స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: ప్యాంటులో బంగారం అక్రమ రవాణా