ETV Bharat / jagte-raho

ఖమ్మంలో స్కూటీ టిప్పర్ ఢీ... ఇద్దరు మృతి - ఖమ్మం రోడ్డు ప్రమాదాలు తాజా వార్తలు

ఖమ్మం జిల్లాలోని కామేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్​ను స్కూటీ ఢీకొంది. స్కూటీ మీద ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు.

road accident at kamepally in khammam district
ఖమ్మంలో స్కూటీ టిప్పర్ ఢీ... ఇద్దరు మృతి
author img

By

Published : Dec 2, 2020, 9:27 AM IST

ఖమ్మం జిల్లా కామేపల్లి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇల్లందు మార్గంలో నిలిపి ఉన్న టిప్పర్​ని స్కూటీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

ఉదయాన్నే మంచు ఉండడంతో రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన టిప్పర్ గమనించక పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల ఆధార్ కార్డుల ప్రకారం యువతి కీర్తి మాలతి వైజాగ్​కు చెందిన వ్యక్తిగా... మరొక వ్యక్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక చెందిన యుగంధర్​గా గుర్తించినట్లు ఎస్సై స్రవంతి తెలిపారు.

ఇదీ చదవండి: పెళ్లిలో మాంసం పెట్టలేదని గొడ్డలితో హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.