ETV Bharat / jagte-raho

కూలీల ఆటో బోల్తా: మహిళ మృతి - telangana news

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొనకొండ్ల సమీపంలో కూలీల ఆటో బోల్తా పడగా మహిళ మృతి చెందింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

road-accident-at-anantapur-district-guntakal-and-women-died in andhra pradesh
కూలీల ఆటో బోల్తా: మహిళ మృతి
author img

By

Published : Jan 17, 2021, 10:43 AM IST

కూలీల ఆటో బోల్తా: మహిళ మృతి

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకొండ్ల సమీపంలో కూలీల ఆటో బోల్తా పడి ఓ మహిళ మృతి చెందింది. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కొనకొండ్ల గ్రామానికి చెందిన 18 మంది కూలీలు పప్పు శనగ పంటను తొలగించడానికి ఆటోలో కర్నూలు జిల్లాలోని గుమ్మనూరు గ్రామానికి వెళ్తున్నారు. మార్గంమధ్యలో జాతీయ రహదారి పనులు జరుగుతున్న కారణంగా... రహదారికి అడ్డంగా మట్టి కుప్పలు వేశారు. ఆటో డ్రైవర్ గమనించక.. మట్టికుప్ప పైకి వాహనాన్ని ఎక్కించాడు.

వేగంగా వెళ్తుండడం వల్ల ఆటో 3 సార్లు పల్టీలు కొట్టి పడిపోయింది. కూలీలపై వాహనం పడి వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో రమణమ్మ (35) అనే మహిళ మృతి చెందింది. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మరో 12 మందిని గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికిి తరలించారు. క్షతగాత్రులను గుంతకల్లు డీఎస్పీ షర్పుద్దీన్ పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి: నమ్మకంగా నటించి ఆ ఇంటికి కన్నమేశాడు !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.