రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి సిక్ చావునీ ప్రాంతంలో రైస్ పుల్లింగ్కు పాల్పడుతున్న 14 మందిని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. 9 మంది కర్నూలు వాసులతో చేతులు కలిపి ఓ వ్యక్తితో రూ.15 లక్షలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకున్నారు.
వారి నుంచి రైస్ పుల్లింగ్ పాత్ర, ఒక కారు, బైక్, రూ.1,30,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి: నేటి నుంచి భారత్- శ్రీలంక నౌకాదళ విన్యాసాలు