వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని సుబేదారి ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఖైసర్ అనే వ్యక్తి చోరీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. నిందితుడికి కరోనా లక్షణాలు ఉండటం వల్ల ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు.. ఖైసర్ను ఎంజీఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు.. భోజన సమయంలో పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. ఫలితంగా ఖైసర్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఆసుపత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరార్.. గాలింపు చర్యలు ముమ్మరం - వరంగల్లో ఖైదీ పరార్ వార్తలు
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి ఓ రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. కొవిడ్ లక్షణాలతో దవాఖానాకు తీసుకురాగా.. భోజన సమయంలో పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. నిందితుని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

ఆసుపత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరార్.. గాలింపు చర్యలు ముమ్మరం