మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముట్రాజ్‌పల్లికి చెందిన గీతా మాధురి అక్టోబర్ 6 మంగళవారం రోజు పురిటి నొప్పులతో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. పరీక్షల అనంతరం సాధారణ ప్రసవంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. మరునాడు సాయంత్రం కల్లా పుట్టిన బిడ్డ చనిపోయాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడంటూ బంధువులు, శిశువు తండ్రి ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. సాధారణ ప్రసవం అయిన తర్వాత వైద్యులు సరిగ్గా పట్టించుకోలేదని.. అందుకే తమ బిడ్డ చనిపోయాడంటూ శిశువు తండ్రి లక్ష్మీ నారాయణ ఆరోపించారు.
తమకు న్యాయం చేయాలంటూ బాధితురాలి బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సత్య నారాయణ తెలిపారు. శిశువు మృతిపై ఆస్పత్రి సూపరిడెంటెంట్ మీర్జా బేగ్‌ను వివరణ కోరగా.. వైద్యం అందించడంలో ఎలాంటి జాప్యం జరగలేదని తెలిపారు. శిశువు మృతికి కారణాలు తెలియాల్సి ఉందని వివరించారు.
ఇదీ చదవండి: నిన్నటి దాకా జై అని.. నేడు నై అంటే ఎట్లా..: హరీశ్‌రావు