ETV Bharat / jagte-raho

270 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత - రేషన్​ బియ్యం అక్రమ రవాణా వార్తలు

సంగారెడ్డి జిల్లాలోని 65వ నంబరు జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని బుదేరా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలింపునకు యత్నించిన వారిపై కేసు నమోదు చేశారు.

ration rice, budera police
రేషన్​ బియ్యం, బుదేరా పోలీసులు
author img

By

Published : Jan 17, 2021, 11:16 AM IST

ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా పోలీసులు పట్టుకున్నారు. 65వ నంబర్ జాతీయ రహదారిపై కంకోల్​ టోల్​గేట్ వద్ద తనిఖీలు చేస్తుండగా రేషన్ బియ్యం అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది.

డీసీఎం, ఎనిమిది ఆటోల్లో జహీరాబాద్ వైపు తరలిస్తున్న రూ. 5.45 లక్షల విలువైన 270 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను సీజ్​ చేసి, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కేసు నమోదు చేశారు. బియ్యాన్ని పోలీస్ స్టేషన్​లో భద్రపరిచారు.

ఇదీ చదవండి: సొంత అన్ననే కర్రతో కొట్టి చంపిన తమ్ముడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.