మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్ పరిధిలో ధనలక్ష్మి జ్యూలర్సీ అనే ఒక షాపు ఉంది. ఈనెల 12న తన షాపులోని బంగారం వెండి ఆభరణాలు మాయమయ్యాయని... చోరీకి గురైనట్లు తెలుస్తోంది యజమాని నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగినప్పుడు పనిచేసే సేల్స్ మెన్ పప్పు రామ్ షాపులోనే ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. అయితే షాపులో తాను నిద్రిస్తున్నానని.. ఎలా దొంగతనం జరిగిందో తనకు తెలియదని పోలీసులకు వివరించాడు. సీసీటీవీ కెమెరాలు ఫుటేజ్ తనిఖీ చేసేందుకు పోలీసులు చూడగా... దానికి సంబంధించిన డి.వి.ఆర్ కూడా తీసుకెళ్లి పోయినట్లు గుర్తించారు. పోలీసులకు షాపులో ఉన్న పప్పు రామ్ పై అనుమానం వచ్చింది. అతన్ని తమదైన రీతిలో విచారించగా అసలు విషయం బయటపడింది.
షాపు యజమాని వద్ద రాజస్థాన్‌కు చెందిన పప్పు రామ్ అనే వ్యక్తి సంవత్సరంన్నర కింద సేల్స్‌మెన్‌గా చేరాడు. ఇదే క్రమంలో షాపు సమీపంలో ఉండే సుఖదేవ్ సింగ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వచ్చే జీతం సరిపోక విలాసవంతమైన జీవితం తన అనుభవించేందుకు తాను పనిచేసే షాప్‌కి కన్నం వేసేందుకు ఇద్దరూ కలిసి ప్రణాళిక రూపొందించారు. పప్పురామ్ సుఖదేవ్ సింగ్‌కి ఫోన్ చేసి... షాప్‌లో కొత్తగా స్టాక్ వచ్చిందని అందుబాటులో సుమారు 70 కేజీల వెండి ఆభరణాలు ఉన్నాయని ఇదే మంచి సమయం అని తెలిపాడు.
రాజస్థాన్‌లో ఉండే అతడి సోదరుడు రామ్ దేవసికి విషయం చెప్పాడు. ఇందుకు అంగీకరించిన రామ్ దేవసి.. ఈనెల 10న హైదరాబాద్‌కి వచ్చాడు. అతనితోపాటు బేగంబజార్‌లో ఉన్న స్నేహితుడు దా దూరంకి సమాచారం ఇచ్చారు. చోరీ చేసేందుకు ఈనెల 11న పథకం వేశారు.
అర్ధరాత్రి అతని స్నేహితులతో కలిసి ఆటో వెంట తెచ్చుకుని షాప్ లోపలికి వెళ్లి వెండి బంగారు ఆభరణాలను గోనె సంచుల్లో నింపి ఆటోలో వేశారు. అనంతరం సీసీటీవీ కెమెరాల్లో ఫుటేజ్ పోలీసులకు దొరకకుండా దానికి సంబంధించిన డి.వి.ఆర్ తీసుకెళ్లారు. బంగారం, వెండి ఆభరణాలు తన స్నేహితులు తీసుకెళ్లిన తర్వాత ఏమీ తెలియనట్లు షాపులో నిద్రించాడు పప్పు రామ్. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. నిందితుల నుంచి 28 తులాల బంగారం, 63.657 కేజీల వెండి, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 47.27 లక్షలు ఉంటుందని వివరించాడు.
ఇదీ చూడండి: యుద్ధ వ్యూహాలతో శత్రు దేశాలను ఎదుర్కొందాం : సీఎం కేసీఆర్