ETV Bharat / jagte-raho

అమాయకులే లక్ష్యంగా రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు - Hyderabad cyber crime news

అమాయకులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారి అవకాశాలను ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. మోసపోయిన బాధితులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

అమాయకులే లక్ష్యంగా రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

author img

By

Published : Dec 13, 2020, 6:45 PM IST

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు. సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన సయ్యద్ అహ్మద్ విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. శాంసన్ లీగల్ ఛాంబర్స్ జెమ్స్ ఎడ్వర్డ్ అనే వ్యక్తి నుంచి ఎంబసీ కాంటాక్ట్ నంబర్​తో ఉన్న మెయిల్ వచ్చింది. ఆ నంబర్​లో ఉన్న డేవిడ్ అనే వ్యక్తితో మాట్లాడితే ఎలాంటి పరీక్షలు లేకుండా యూకేకి వీసా ఇప్పిస్తానని మెయిల్ నమ్మించాడు. అహ్మద్ సంప్రదించగా ఖర్చుల కోసమంటూ రూ. 1.50 లక్షలు తన ఖాతాలో జమ చేయించుకొని ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు.

అఫ్జల్​గంజ్​కు చెందిన అమిత్​ కుమార్ ఉద్యోగం కోసం ఓ సైట్​లో ఫ్రొఫైల్ పోస్ట్​ చేశారు. రెండు రోజుల కింద ఆయనకో వ్యక్తి ఫోన్ చేసి ఉద్యోగం ఉందని చెప్పి ధ్రువపత్రాలు, ఇతరాత్రా ఖర్చుల పేరుతో రూ. 60వేలు దోచేశారు. శాలిబండకు చెందిన షేక్ ముఖ్రమ్ హుస్సేన్​కు రాజ్ కుమార్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు.

కౌన్ బనేగా కరోడ్​పతి కార్యక్రమ ప్రతినిధిని మాట్లాడుతున్నాను. లాటరీలో మీకు రూ. 10 లక్షల విలువ గల బహుమతి వచ్చిందని నమ్మించాడు. జీఎస్టీ, ఇన్​కంటాక్స్, సీఎస్టీ వంటి కట్టాలని రూ. 1.55 లక్షలు తన ఖాతాలో జమా చేయించుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: 10 మందిని బలితీసుకున్న రహదారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.