అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాల వివాదం ఓ కన్నతల్లి నిండు ప్రాణాన్ని బలితీసుకున్న దుర్ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మతండాలో చోటుచేసుకుంది. అన్నపై కోపంతో తమ్ముడు దాడి చేస్తుండగా మధ్యలోకి వెళ్లిన కన్నతల్లికి రోకలి బండ తగిలి... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
సపవట్ హనుమ, మసృ దంపతులకు ఇద్దరు కొడుకులు కిషన్, బాలు. తండ్రి పేరుపై ఉన్న 9 గుంటల భూమిని తనకు బదిలీ చేయాలంటూ బాలు డిమాండ్ చేశాడు. ఇది కాస్త అన్నదమ్ముల మధ్య గొడవకు దారితీసింది. అడ్డుకున్న కన్నతల్లికి రోకలి బండ తగిలి తీవ్రంగా గాయపడింది. హుటాహుటన ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం దక్కలేదు. కన్నతల్లి మృతికి కారణమైన బాలును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మంచాల పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: భార్యపై అనుమానం.. గొంతు కోసి హత్య