ETV Bharat / jagte-raho

భారీగా గుట్కా, రేషన్​ బియ్యం, నల్ల బెల్లం పట్టివేత - mahabubabad district illegal jaggery captured news today

వేర్వేరు కేసుల్లో అక్రమంగా రవాణా చేస్తోన్న గుట్కా ప్యాకెట్లు, నల్ల బెల్లం, పటిక బెల్లం, రేషన్ బియ్యాన్ని మహబూబాబాద్ పోలీసులు పట్టకున్నారు. వివిధ కేసుల్లో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు.

వేర్వేరు కేసుల్లో గుట్కా, రేషన్​ బియ్యం, నల్ల బెల్లం భారీగా పట్టివేత

author img

By

Published : Sep 20, 2020, 8:36 AM IST

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సీరోలు పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు వేర్వేరు కేసుల్లో గుట్కా- అంబర్ ప్యాకెట్లు, నల్ల బెల్లం, పటిక బెల్లం, రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుల వద్ద నుంచి ఆటో, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

నలుగురు అరెస్ట్..

నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలిస్తున్నట్లు సీరోలు ఠాణాలో జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి వెల్లడించారు. బాలవిజయ్, కర్లపాటి స్వామి ఆటోలో తరలిస్తున్న 5 బస్తాల అంబర్ ప్యాకెట్లను కురవి మండలం కాంపల్లి వద్ద పట్టుబడ్డాయి.

అక్రమ వ్యాపారాలు చేస్తే...

సూర్యాతండాలోని బానోత్ రవీందర్ ఇంట్లో 30 క్వింటాల నల్ల బెల్లం, 1 క్వింటా పటిక లభ్యమయ్యాయి. ఉప్పరగూడెం గ్రామంలోని తల్లాడ ప్రసాద్ నివాసంలో అక్రమంగా నిల్వ ఉన్న 31 క్వింటాల రేషన్ బియ్యం సహా ఆటో, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. తర్వాత నిందితులను రిమాండ్​కు తరలించారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.

పీడీ యాక్ట్ ఆలోచిస్తున్నాం..

నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నిందితుల్ని పట్టుకున్న సిబ్బందిని అభినందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ వెంకటరమణ , సీఐ కరుణాకర్, ఎస్ఐ రాణా ప్రతాప్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : జగిత్యాలలో నిషేధిత గుట్కా పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.