యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. వైద్యం వికటించి వల్లెపు శ్రీకాంత్ అనే యువకుడు మృతి చెందాడు.
తుర్కపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వల్లెపు శ్రీకాంత్ అనే యువకుడికి చలి జ్వరం వచ్చింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి శ్రీకాంత్ తండ్రి, స్నేహితులు కలిసి అతడిని మండల కేంద్రంలోని సూర్య హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. చికిత్స చేస్తుండగా.. యువకుడు మరణించారు.
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని బంధువులు ఆసుపత్రిపై దాడి చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఆసుపత్రిలో గతంలోనూ పలుమార్లు వైద్యం వికటించి చనిపోయిన ఘటనలు ఉన్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: పురపాలక శాఖ అధికారులు బాగా పనిచేశారు: కేసీఆర్